కవిత ఇంట్లో ఈడీ సోదాలపై మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు

కవిత ఇంట్లో ఈడీ సోదాలపై మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత ఇంట్లో ఈడీ సోదాలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు.  ఇది బీఆర్ఎస్, బీజేపీ పార్టీలది మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపించారు.  కవిత ఇంట్లో ఈడీ రైడ్స్ ఓ డ్రామా అని  ఇదంతా మోదీ, అమితాషా నాటకలేనని విమర్శించారు.  బీజేపీని ప్రజలు నమోద్దని చెప్పారు.  నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలో మున్సిపాలిటీ సిబ్బందికి శానిటేషన్ కిట్స్ పంపిణీ అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు.  

లిక్కర్ స్కామ్ లో సిసోడియాని అరెస్ట్ చేసినప్పుడే కవితనూ అరెస్ట్ చేయాల్సింది కాదా అని మంత్రి కోమటి రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు కవిత ఇంట్లో రైడ్స్ చేసి తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలని బీజేపీ  ప్రయత్నిస్తోందంటూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.  లిక్కర్ స్కాం లో కవిత అరెస్ట్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు.  

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో  ఈడీ అధికారులు  సోదాలు నిర్వహిస్తున్నారు.  మధ్యాహ్నం 2 గంటల సమయంలో కవిత ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు దాదాపుగా మూడు గంటల పాటు సోదాలు చేస్తున్నారు.  ఇంట్లోనే కవితో పాటుగా ఆమె భర్త అనిల్ ఉన్నారు.  కవిత  ఫోన్లను అధికారులు సీజ్ చేశారు.