పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  
  •     నల్గొండలో నూతన స్కిన్ కేర్ సెంటర్‌‌ ను ప్రారంభించి న మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి  

నల్గొండ అర్బన్, వెలుగు: పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆర్​ అండ్​బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండలోని డాక్టర్స్​ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన లాలిత్య స్కిన్​లేజర్​సెంటర్​హాస్పిటల్​ను ఆయన నల్గొండ మున్సిపల్​ కార్పొరేషన్​మేయర్​ బుర్రి చైతన్య శ్రీనివాస్​రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  హైదరాబాద్​కు దీటుగా నల్గొండలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు మంచి వైద్య సేవలు అందించే విధంగా ఆసుపత్రి నెలకొల్పడం అభినందనీయమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఫీజులు తీసుకోవాలన్నారు. ప్రజలు నల్గొండలో ఉండే ఆసుపత్రులను సద్వినియోగం చేసుకుని వైద్య సేవలు పొందాలని సూచించారు.

 డాక్టర్​ లాలిత్య మాట్లాడుతూ..  ఆసుపత్రిలో చర్మ వ్యాధులకు చికిత్సలు, వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కాంగ్రెస్​ పట్టణాధ్యక్షుడు గుమ్ముల మోహాన్​రెడ్డి, డాక్టర్లు గౌరిశ్రీ, హారినాథ్, లాలిత్య, పుల్లారావు, అనితరాణి, కార్పొరేటర్లు, మెడికల్​ విభాగానికి చెందిన పలువురు పాల్గొన్నారు.