
- కుటుంబ కలహాల్లోకి సీఎం పేరు లాగితే ఊరుకోను : మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బ్లేమ్ చేసిన కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే హరీశ్ ఊరుకోరని చెప్పారు. ఆమెను సస్పెండ్ చేయకపోతే బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లి కొత్త పార్టీ పెట్టుకుంటారని తెలిపారు. సోమవారం ఆయన సెక్రటేరియెట్‌లో మీడియాతో చిట్చాట్చేశారు. "కవిత విషయంలో ఏం చేయాలో రేపు ఆలోచిద్దామని కేసీఆర్ అన్నారట. కేసీఆర్ దగ్గర ఉండే ఒక నాయకుడే నాకు ఈ విషయం చెప్పాడు.
బీఆర్ఎస్ ఇంటి పంచాయితీలోకి మమ్మల్ని లాగకండి. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నారనడాన్ని నేను ఖండిస్తున్నా. ఇందులో సీఎం పేరు లాగితే బాగుండదు. వారి కుటుంబ కలహాల్లోకి మమ్మల్ని లాగకండి" అని కోమటిరెడ్డి అన్నారు.