వనమహోత్సవంలో ఓరుగల్లు ముందుండాలి : కొండా సురేఖ

 వనమహోత్సవంలో ఓరుగల్లు ముందుండాలి : కొండా సురేఖ

కాశీబుగ్గ, వెలుగు: రాష్ట్రంలో ఓరుగల్లు జిల్లాను వనమహోత్సవంలో అగ్రగామిగా నిలబెడదామని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ సిటీ పరిధిలోని 18వ డివిజన్​లోని ఈఎస్​ఐ ఆస్పత్రి ఆవరణంలో 75వ వనమహోత్సవంలో భాగంగా మంత్రి, బల్దియా మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్య శారద, బల్దియా మేయర్ అశ్విని తానాజీ వాకడే, స్థానిక కార్పొరేటర్ వస్కుల బాబుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా 24 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. వివిధ రకాల మొక్కలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

 ప్లాస్టిక్ నిర్మూళనకు వివిధ వాణిజ్య దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో గ్రేటర్ వరంగల్ పరిధిలో  యువకులు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అంతకుముందు వారు వనమహోత్సవ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రేటర్​ సిటీలోని మంత్రి క్యాంప్ ఆఫీస్​లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఖిలా వరంగల్, వరంగల్ మండలాలకు చెందిన 367 మంది లబ్ధిదారులకు రూ.3 కోట్ల 76 లక్షల 42 వేల 572ల సీఎం ఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కలెక్టర్ తో కలిసి మంత్రి పంపిణీ చేశారు కార్యక్రమంలో అధికారులు, పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.