తెలంగాణ తల్లిని మరిచిన మంత్రి కొప్పుల

తెలంగాణ తల్లిని మరిచిన మంత్రి కొప్పుల

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జగిత్యాలలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో కలెక్టరేట్ తో పాటు అన్ని ప్రభుత్వ ఆఫీసులను అంగరంగ వైభవంగా లక్షలు పోసి ముస్తాబు చేశారు. జిల్లాలోని స్థానిక కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ముస్తాబు చేయకపోవడం, కనీసం మినిస్టర్ కొప్పుల పూలమాల కూడా వేయ లేదు. 

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను లక్షలు ఖర్చు 22 రోజుల పాటు నిర్వహణ కు ఏర్పాట్లు చేసింది. కలెక్టరేట్ లో జెండా ఎగురవేసిన మంత్రి తెలంగాణ తల్లిని విస్మరించడం పట్ల తెలంగాణ వాదులు అసహనం వ్యక్తం చేస్తున్నారు..వెంటనే తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు..