కేసీఆర్ ఎవరికీ లొంగడు.. భయపడడు

కేసీఆర్ ఎవరికీ  లొంగడు.. భయపడడు

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందంటున్న బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ  డబుల్ ఇంజన్ అంటే... మోడీ, ఈడీ లేకపోతే  జుమ్లా, హమ్ల అంటూ సెటైర్లు వేశారు.   రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ చేసిన సర్వే లు కూడా తాము గెలుస్తున్నామని  చెప్పాయన్నారు.  2023లోనే ఎన్నికలు జరుగుతాయని.. ముందస్తుకు  వెళ్ళబోమని చెప్పారు.  ప్రజాదరణ పొందిన నాయకులకే ఎమ్మేల్యే టికెట్ లు ఇస్తామన్నారు.  కేసీఆర్ ఎవరికి లోంగడు.. భయపడడని అన్నారు. తమ ఐడియాలజీ నచ్చిన  వారు ఎప్పటికీ తమతోనే ఉంటారన్నారు . రానున్న మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోతుందన్నారు. కాంగ్రెస్ ఓడిపోయిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు.  ప్రశ్నించడాన్ని కూడా అన్ పార్లమెంటరీ అంటే వర్డ్ అంటే ఎలా అని అన్నారు.

రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు కేంద్రం ఎటువంటి సాయం చేయలేదని కేటీఆర్ అన్నారు.  నరెగా పనులు మన రాష్ట్రంలో జరిగినట్టు ఎక్కడ జరగడం లేదన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో గ్రామాలు తిరుగుదాం.. తెలంగాణ పల్లెల్లో తిరుగుదామని సవాల్ చేశారు. పల్లె గోస బీజేపీ యాత్ర ఎవరికి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు.  కేంద్రానికి  తెలంగాణ ఇచ్చేది రూపాయి అయితే.. కేంద్రం మన రాష్ట్రానికి ఇచ్చేది 40 పైసలు మాత్రమేనన్నారు. ఇది నిజం కాదని ఎవరైనా నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మోడీ ప్రయివేట్ విజిట్ లకు  తాము ఎందుకు రిసీవ్ చేసుకుంటామన్నారు. మోడీ దేశానికి కాదు.. గుజరాత్ కు ప్రధాని అంటూ విమర్శించారు.