
మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జగన్నాథంతో మంత్రి కేటీఆర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మునుగోడులో టీఆర్ఎస్ కు సహకరించాలని మంత్రి కేటీఆర్ ఆయనను కోరారు. మీరు కొంచెం సహకరిస్తే.. గట్టుప్పల్ ను అభివృద్ధి చేసుకుందామని కేటీఆర్ ఆయనతో అన్నారు. రైతుబంధు వందల ఎకరాలున్న భూస్వాములకు ఇవ్వటం కాదు.. వ్యవసాయం చేసే వారికి, కౌలు రైతులకు కూడా ఇవ్వాలని బీజేపీ నేత జగన్నాథం కేటీఆర్ కు సూచించారు.
పార్టీకి మోసం చేసే ప్రసక్తే లేదు : జగన్నాథం
మంత్రి కేటీఆర్ ఫోన్ చేసినప్పటికీ పార్టీకి మోసం చేసే ప్రసక్తే లేదని జగన్నాథం తెలిపారు. బీజేపీని వీడేది లేదని ఆయన తేల్చి చెప్పారు. జగన్నాథం కమిట్ మెంట్ ను మునుగోడు బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అభినందించారు. బీజేపీ నేతలను మంత్రులు కొనలేరన్నారు. బీజేపీ లీడర్లను కొనడానికి మంత్రులు ప్రయత్నిస్తున్నారనటానికి ఇది నిదర్శనమని వివేక్ వెంకటస్వామి తెలిపారు.