బరాబర్ మాది కుటుంబ పాలనే: కేటీఆర్

బరాబర్ మాది కుటుంబ పాలనే: కేటీఆర్

రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందన్న ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి కేటీఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. తమది ముమ్మాటికీ కుటుంబపాలనే అన్నారు. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు తమ కుటుంబసభ్యులేనన్న కేటీఆర్.. సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి పెద్ద అని చెప్పారు. అందుకే కుటుంబపాలన అంటున్న  ప్రతిపక్షాల విమర్శల్ని తాము స్వీకరిస్తామని అన్నారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కుటుంబంలోని అవ్వ తాతకు పెన్షన్ ఇస్తూ పెద్ద కొడుకులా ఆసరా అయితుండని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని 4కోట్ల మందిని తోబుట్టువుగా చూసుకుంటున్నాడని అన్నారు. కంటి వెలుగుతో వృద్ధులకు కంటి చూపు, గురుకులాలు, కాలేజీలతో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్న కేసీఆర్.. ఒంటరి మహిళలకు ఫించన్ ఇస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నాడని చెప్పారు. 12 లక్షల మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందించి కేసీఆర్ మేనమామలా అండగా నిలిచాడని అన్నారు.