హైదరాబాద్ లో వరదలు : ప్రభుత్వం తప్పు ఎంతుందో ..ప్రజల తప్పు అంతే ఉంది

హైదరాబాద్ లో వరదలు : ప్రభుత్వం తప్పు ఎంతుందో ..ప్రజల తప్పు అంతే ఉంది

హైదరాబాద్ లో వర్షాల పై మంత్రి కేటీఆర్ రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ వరదల వల్ల ప్రభుత్వం తప్పు ఎంతుందో..ప్రజల తప్పు అంతే ఉందన్నారు. హైదరాబాద్ పట్టణ చరిత్రలోనే తొలిసారి 1908సంవత్సరంలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా..అక్టోబర్ నెలలో అత్యధిక వర్ష పాతం నమోదైందని చెప్పారు. రాబోయే మూడు రోజులు వర్షం పడే అవకాశం ఉన్నందున  ప్రజల్ని అలర్ట్ చేసేందుకు ప్రభుత్వం 80సీనియర్ అధికారుల్ని నియమించినట్లు కేటీఆర్ అన్నారు.

వరదల నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న కేటీఆర్..ఇప్పటి వరకు 37వేల కిట్లు, నిత్యావసర సరుకులతో పాటు ఈ విపత్తు నుంచి బయటపడేందుకు రూ.45కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. మరో రూ.670 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఈ వరదల నుంచి రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలంటూ కేంద్రానికి రిపోర్ట్ పంపించినట్లు కేటీఆర్ వెల్లడించారు. రిపోర్ట్ ఆధారంగా భారీ వర్షాల కారణంగా జీహెచ్ ఎంసీకి రూ.670కోట్ల తాత్కాలిక నష్టం వాటిల్లిందన్నారు. వరదల వల్ల చనిపోయిన వారి డేటా తమవద్ద లేదని అనడం సమంజసం కాదన్న మంత్రి కేటీఆర్ ..జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 33మంది చనిపోయారని, వారిలో 29మందికి నష్టం పరిహారం అందించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న పరిస్థితికి ప్రభుత్వాల తప్పు ఎంతుందో , మానవ తప్పిదాలు కూడా అంతే ఉన్నాయన్నారు.

వర్షంలో ఇంటి పైకప్పు లో ఉంటామని ప్రజలు అంటున్నారు అలా ఉండకండి.. ప్రాణాలను ఎవ్వరూ రిస్క్ లో పెట్టుకోవద్దు- ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. వర్షం పడుతుందని ప్రభుత్వం వద్ద సమాచారం వుంది. కానీ ఎంత వాన పడుతుంది అనేది అంచనా వేయలేము కదా అంటూ మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమీక్షలపై వ్యాఖ్యానించారు.