పెట్రో రేట్లపై ప్రధాని మోడీకి కేటీఆర్ కౌంటర్

పెట్రో రేట్లపై ప్రధాని మోడీకి కేటీఆర్ కౌంటర్

పెట్రో ధరలను రాష్ట్రాలు తగ్గించాలన్న ప్రధాని నరేంద్రమోడీకి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కారణంగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని మండిపడ్డారు. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించడం లేదంటున్న ప్రధాని.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏనాడు పెట్రో ఉత్పత్తులపై పన్ను పెంచలేదని చెప్పారు. కేవలం ఒక్కసారి రౌండాఫ్ చేశామని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మీరు మాట్లాడుతున్న కో ఆపరేటివ్ ఫెడరలిజం ఇంటే ఇదేనా అని మోడీని ప్రశ్నించారు. 

కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్ కారణంగా రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన 41శాతం వాటా దక్కడం లేదని కేటీఆర్ చెప్పారు. సెస్ రూపంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11.4శాతాన్ని లూటీ చేస్తోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేవలం 29.6శాతం వాటా మాత్రమే దక్కుతోందని చెప్పారు. కేంద్రం సెస్ రద్దు చేస్తే దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ప్రైస్ అమలు చేయొచ్చని, అప్పుడు లీటర్ పెట్రోల్ రూ.70, డీజిల్ రూ.60కు దిగి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.