యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ బహిరంగ లేఖ

యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ బహిరంగ లేఖ

హైదరాబాద్: తెలంగాణ యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ రాశారు. రాష్ట్రంలో కొలువుల కుంభమేళా సాగుతోందని... ఉద్యమ కాలంలో, అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీలకు మించి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టిందన్నారు. యువత ఆశలు, ఆకాంక్షలు, వారి బంగారు భవిత కోసమే ప్రభుత్వం కృషి చేస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.

‘స్వరాష్ట్రంలో స్వపరిపాలన మొదలుపెట్టిన తొమ్మిదేండ్ల వ్యవధిలో దాదాపు 2 లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అని కేటీఆర్ అన్నారు. యువత కష్టపడి చదివి..కలల్ని నిజం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకశాల కల్పనలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలను నిజం చేయడమనే లక్ష్యంగా పనిచేస్తోన్న టీఆర్ఎస్ ప్రభుత్వం...  దేశంలో నవ శకానికి నాంది పలికిందని మంత్రి కేటీఆర్ వివరించారు.