సీఎం కేసీఆర్ దళిత చైతన్య జ్యోతిని ఆనాడే ప్రారంభించారు

 సీఎం కేసీఆర్ దళిత చైతన్య జ్యోతిని ఆనాడే ప్రారంభించారు

తెలంగాణలో గత ఎనిమిదేండ్ల నుంచి తీసుకున్న పాలసీలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్ లో దళిత ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో బిజినెస్ ఫెసిలిటి సెంటర్ ను ఆయన ప్రారంభించారు. సీఎం కేసీఆర్ దళిత చైతన్య జ్యోతిని ఆనాడే ప్రారంభించారన్నారు. కులాలు, మతాలు మనిషి సృష్టించినవేనని.. ప్రస్తుతం దేశంలో డబ్బు ఉన్నకులం, లేని కులం మాత్రమే ఉందన్నారు.

అందరి ముందున్న అతిపెద్ద సవాల్ ఉపాధి కల్పన అని తెలిపారు. పేదరిక నిర్మూలనను అర్ధవంతంగా అమలు చేయాలన్నదే కేసీఆర్ ఉద్దేశమన్నారు. అందులో నుంచి పుట్టిన ఆలోచనే దళితబంధు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, డీఐసీసీఐ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మిలింద్ కాంబ్లే, జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.