
హైదరాబాద్ : దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇనిస్టిట్యూట్... ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అని అన్నారు మంత్రి కేటీఆర్. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పాప్యులేషన్ స్కేల్ ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ట్రిపుల్ ఐటీ కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. రోడ్ సేఫ్టీ కోసం సహాయం అందిస్తున్న ఇంటెల్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. కామన్ మ్యాన్ ని ఉపయోగపడే టెక్నాలజీని తీసుకురావాలని సీఎం చెబుతూ ఉంటారన్నారు కేటీఆర్. అగ్రికల్చర్ సెక్టార్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తీసుకొస్తున్నామని చెప్పారు. సిరిసిల్ల లోని వీరన్నపల్లి గ్రామంలో AI టెక్నాలజీతో కూడిన మాడ్యూల్స్ ని వాడుతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.