9 ఏళ్లలో తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు : మంత్రి కేటీఆర్

9 ఏళ్లలో తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు : మంత్రి కేటీఆర్

దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు మంత్రి కేటీఆర్.  దేశ తలసరి ఆదాయంలో రాష్ట్రం నెంబర్ వన్ లోఉందన్నారు.  9 ఏళ్ల క్రితంతో పోలిస్తే  తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు.  గడిచిన 9 ఏళ్లలో రాష్ట్రంలో  కరువు లేదు, కర్ఫ్యూ లేదన్నారు.   బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మంత్రి కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు.   

 తెలంగాణది సమ్మిళిత, సమగ్ర, సమీకృత మోడల్ అని చెప్పారు మంత్రి కేటీఆర్. సంపద పెంచడం, పేదలకు పంచడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.   రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేదన్నారు.  దేశంలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.  కర్నాటకలో  5 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.  

Also Read : సెకండ్ లిస్ట్ తర్వాత కాంగ్రెస్ లో తిరుగుబాట్లు : రెబల్స్ గా దిగుతామంటూ వార్నింగ్స్

బీఆర్ఎస్ ప్రభుత్వంలో  పల్లెలు,పట్టణాలు అభివృద్ధి సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు.  పర్యావరణాన్ని కాపాడుతూనే  పారిశ్రామికీకరణలో దూసుకుపోతున్నామని తెలిపారు.  అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్న ఏకైక  రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.  ఐటీలో 400 శాతం అభివృద్ధి సాధించామని చెప్పారు.  

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్లు బాధపడిందన్నారు.  2004  నుంచి 14 మధ్య  కాంగ్రెస్ 24 వేల ఉద్యోగాలు ఇచ్చిందన్న కేటీఆర్..  2014 నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్ లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు.