కేటీఆర్​ను కలిసిన నీలం మధు

కేటీఆర్​ను కలిసిన నీలం మధు

పటాన్​చెరు, వెలుగు : హైదరాబాద్​ కోకాపేటలో నిర్మించిన 15ఎంఎల్​డీ కెపాసిటీ ఎస్​టీపీ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ను బీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకులు  నీలం మధు ముదిరాజ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్​కు మరోసారి అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మంత్రి కేటీఆర్​ విదేశాల్లో సైతం తిరుగుతూ స్వరాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చెందేలా చూస్తున్నారని తెలిపారు. 

స్టూడెంట్స్​కోసం ఆటోలు 

గుమ్మడిదల మండలం మంబాపూర్ నుంచి గుమ్మడిదల వరకు స్కూల్​ స్టూడెంట్స్​ రవాణా సౌకర్యం కోసం రెండు ఆటోలను ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వాటిని శనివారం ప్రారంభించారు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న  విషయం ఎన్​ఎంఆర్​యుసేనా  దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీలం మధు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక  సర్పంచ్ కంజర్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ దయానంద్, గుమ్మడిదల మండల ఎన్ఎంఆర్​ యువసేన నాయకులు గ్యారల మల్లేశ్, తుజాల్ పూర్ వీరేశ్, జింక గోపాల్, విష్ణు, ముత్యాలు, అశోక్, దేవునిచెరువు నర్సింలు, నల్లవల్లి సురేశ్, దోమడుగు నాగరాజు, శంకర్, ప్రకాశ్, విజయ్, నర్సింలు, శ్రీకాంత్, ప్రశాంత్, నాగరాజు, అరుణ్, గ్రామ పెద్దలు, ఎన్​ఎంఆర్​ యువసేన సభ్యులు పాల్గొన్నారు.