హైదరాబాద్ ఐటీ గ్రోత్ గణనీయంగా పెరుగుతోంది

హైదరాబాద్ ఐటీ గ్రోత్ గణనీయంగా పెరుగుతోంది

టీ హబ్, వీ హబ్ ద్వారా స్టార్టప్స్ కి రాష్ట్ర ప్రభుత్వం చేయుతనిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్త టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకోవడానికి ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. నాస్కామ్ 12వ ఎడిషన్ GCC కాంక్లేవ్ లో ఆయన పాల్గొన్నారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ కాంక్లేవ్ లో ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..TASK ద్వారా డిగ్రీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ దిగ్గజ ఐటీ, ఫైనాన్స్ కంపెనీలు తమ సంస్థలను హైదరాబాద్ లో ఏర్పాటు చేశాయన్న మంత్రి..వరల్డ్ టాప్ 5 ఐటీ కంపెనీలు తమ సెకండ్ లార్జెస్ట్ సెంటర్స్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన్నట్లు తెలిపాయి. 

హైదరాబాద్ ఐటీ గ్రోత్ గణనీయంగా పెరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. మోస్ట్ లివేబుల్ సిటీగా హైదరాబాద్ నిలుస్తోందని..ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందని చెప్పారు.‘‘ బెంగుళూర్ లో ట్రాఫిక్ ఎక్కువ. చెన్నై లో హుమిడిటీ ఎక్కువ. ముంబై ఎక్స్పెన్సివ్ సిటీ అలాగే అక్కడ రాజకీయ అనిశ్చితి ఉంటుంది. బెస్ట్ బిజినెస్ స్కూల్స్ హైదరాబాద్ లో ఉన్నాయి’’అని కేటీఆర్ అన్నారు.  కొత్త సంస్థలు ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ గా మారిందని చెప్పారు.
ఇండస్ట్రీకి అనువైన పాలిసీలను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని..టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 15రోజుల్లో అన్నిరకాల అనుమతులు వస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్స్ టైంలో కేవలం ఆరు నెలలపాటు రాజకీయాలపై దృష్టి పెట్టి మిగతా నాలుగున్నరేళ్లు రాష్ట్ర అభివృద్ధి, ఎకానమీ, ఎంప్లాయిమెంట్ పై దృష్టి పెడుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.