కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించిన కేటీఆర్

కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించిన  కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లె గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 33 లక్షలతో నిర్మించిన కేసిఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల మంజూరుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని..త్వరలోనే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. అందరి బాగుకొసమే కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.

8ఏళ్లలో  తెలంగాణ గ్రామాలు, పల్లెలను దేశానికే ఆదర్శంగా నిలిపామని కేటీఆర్ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయితీలో త్రాగునీటి సౌకర్యంతో పాటు వైకుంఠధామం, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, రోడ్లు, డ్రైనేజీలు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. గ్రామంలో కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి విరాసత్ సహా అన్ని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఇక  సొంత జాగాలో ఇండ్ల నిర్మాణం చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.