ఎంతటి వారైనా విడిచిపెట్టొద్దు..!

ఎంతటి వారైనా విడిచిపెట్టొద్దు..!
  • ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దు
  • వార్త చూసి షాక్‌ గురయ్యా

హైదరాబాద్‌:  మైనర్ బాలిక అత్యాచారం కేసుకు సంబంధించి ఎంతటి వారినైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డిని మంత్రి కోరారు. హోదాతో సంబంధం లేకుండా నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని.. నిస్పక్షపాత విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందన్న వార్త చూసి షాకయ్యానని అన్నారు. ఈ కేసులో నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ బీజేపీ శ్రేణులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేష‌న్‌లోకి చొచ్చుకెళ్ల‌డంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.  

మరిన్ని వార్తల కోసం...

ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్ద పీట

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా మళ్లీ అంబానీ