దేశ జ‌వాన్లతో కేంద్రం ఆడుకుంటోంది

దేశ జ‌వాన్లతో  కేంద్రం ఆడుకుంటోంది

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్ధితి పైన తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ‘అగ్నిపథ్’ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు దేశంలో ఉన్న నిరుద్యోగ సంక్షోభానికి నిదర్శనమని అన్నారు. ముందుగా దేశ రైతుల‌తో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంద‌ని, ఇప్పుడు దేశ జ‌వాన్లతోనూ ఆడుకుంటోంద‌ని కేటీఆర్ ఆరోపించారు. వ‌న్ ర్యాంక్ వ‌న్ పెన్షన్ విధానం నుంచి ఇప్పుడు దేశంలో నో ర్యాంక్ నో పెన్షన్ గా మారింద‌ని కేటీఆర్ కేంద్రం పై విమర్శలు గుప్పించారు.