
ఆదిలాబాద్ లో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అమిత్ షా ప్రసంగమంతా అబద్ధాలేనని మండిపడ్డారు. అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదని మళ్లీ.. బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు ఖాయమన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానమన్న అమిత్ షా వ్యాఖ్యలు అసత్యమన్న కేటీఆర్... రైతు సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణలో మత రాజకీయాలు చెల్లవన్నారు. కారు స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉందని, బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతుల్లో ఉందని విమర్శించారు . ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే అమిత్ షా అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు.