పోడు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసేదేం లేదు

పోడు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసేదేం లేదు

పోడు భూముల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యకు కేంద్రమే పరిష్కారం చూపాలని అన్నారు. సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమీ లేదని అన్నారు. కేంద్రం పోడు భూముల చట్టాన్ని సవరిస్తే వెంటనే పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లు పార్లమెంటులో చట్ట సవరణ చేస్తే ఆ పార్టీ వారితోనే గిరిజనులకు పట్టాలు ఇప్పిస్తామని అన్నారు. కేంద్రం తీసుకురాబోతున్న ఆదివాసీల హక్కులను కాలరాసే చట్టాలను అడ్డుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. 

పోడు భూముల 12 లక్షల అప్లికేషన్లు వచ్చాయని కేటీఆర్ ప్రకటించారు. వాటిలో ట్రైబల్, నాన్ ట్రైబల్ దరఖాస్తుదారులు ఉన్నారని చెప్పారు. రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్.. ROFR యాక్ట్ కేంద్రం పరిధిలో ఉందని.. కట్ ఆఫ్ డేట్ పెంచి, చట్టాన్ని సవరణ చేస్తే పోడు భూముల సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.