బండి సంజయ్ పాదయాత్రపై కేటీఆర్ సెటైర్లు 

బండి సంజయ్ పాదయాత్రపై కేటీఆర్ సెటైర్లు 

బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.దమ్ముంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ విద్యాసంస్థలను రద్దుచేసే విధంగా చర్యలు తీసుకుంటే టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో  బండి సంజయ్ ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఏ మొఖం పెట్టుకుని పాలమూరులో బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వనందుకు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉచిత విద్య ఇస్తామంటున్న బీజేపీ.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వట్లేదో సమాధానం చెప్పాలన్నారు.పాదయాత్రను అడ్డుకోవాల్సిన ఖర్మ తమకు లేదన్నారు.మతపిచ్చి రెచ్చగొట్టడం.. పిల్లల్ని చెడగొట్టడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు.అసలు కర్ణాటకలో కాంట్రాక్టర్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు.హైదరాబాద్ HICCలో పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు పరిశీలించిన కేటీఆర్..ఈ నెల 27న టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు.

మరిన్ని వార్తల కోసం

కర్ణాటకలోని హుబ్బళ్లిలో 144 సెక్షన్

చైనాపై కోవిడ్ పంజా