కర్ణాటకలోని హుబ్బళ్లిలో 144 సెక్షన్

కర్ణాటకలోని హుబ్బళ్లిలో 144 సెక్షన్

హుబ్బళ్లి/ కర్ణాటక: రాష్ట్రంలోని హుబ్బళ్లిలో పోలీసులపై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం... ఈనెల 20 వరకు  హుబ్బళ్లిలో 144 సెక్షన్ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దాడి ఘటనను కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఖండించారు. ఇలాంటివి సహించబోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వివాదాస్పద పోస్టింగ్ తో కర్ణాటక హుబ్బళ్లిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోస్టింగ్ కు వ్యతిరేకంగా ఒక వర్గానికి చెందిన వ్యక్తులు పెద్దసంఖ్యలో పాత హుబ్బళ్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. స్టేషన్ ఎదురుగా ఉన్న కార్వార రహదారిలో వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 12 మంది పోలీసులు గాయపడ్డారు. 10  వాహనాలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.

ఓ వర్గానికి చెందిన ప్రార్థనా మందిరంపై మరో వర్గానికి చెందిన పతాకం ఎగురుతున్నట్లుగా చిత్రీకరించి వాట్సప్ సందేశం పంపడమే ఉద్రిక్తతకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పోస్టు పెట్టిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లకు సంబంధించి సుమారు 60 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

బంజారాహిల్స్ ల్యాండ్ కేసులో 58 మందికి రిమాండ్

దళితులను దగా చేయడానికే దళిత బంధు