
ఖమ్మం: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ఓటమి ఖాయమని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో సోమవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టేందుకే తాను యాత్ర చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఏడేళ్లలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని మండిపడ్డారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ఉద్యోగాలు కల్పించడంలో సీఎం ఫెయిలయ్యారని విమర్శించారు. దళితులను దగా చేయడానికి దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారన్నారు. భూస్వాములు, పెట్టుబడి దారులకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. కేసీఆర్ వల్లే చాలా మంది రైతులు యాసంగిలో వరి సాగుచేయలేదన్న ఆయన... వాళ్లందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తల కోసం...