చైనాపై కోవిడ్ పంజా

చైనాపై కోవిడ్ పంజా

చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. షాంఘైలో వైరస్ వ్యాప్తి తగ్గకపోగా... కొత్తగా మరణాలు కూడా నమోదవుతున్నాయి. దీంతో చైనా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరోవైపు కఠిన క్వారంటైన్ ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. షాంఘైలో ఆదివారం ఒక్కరోజే మూడు కరోనా మరణాలు నమోదైనట్లు ప్రకటించింది చైనా జాతీయ ఆరోగ్య కమిషన్. 89 నుంచి 91 వయసున్న ముగ్గురు కరోనాతో చనిపోయినట్లు ప్రకటించింది. చనిపోయిన వారు వ్యాక్సిన్ తీసుకోలేదని తెలిపింది. ఈ ఏడాది మార్చి నుంచి షాంఘైలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 26 వేల 155 కేసులు రాగా.. 95 శాతం కేసులు షాంఘై సిటీలో నుంచే వచ్చాయి. 

షాంఘైలో కరోనా కేసులు పెరగడంతో.. మార్చి 28న దశలవారీగా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం సిటీలోని 2 కోట్ల 50 లక్షల జనాభా లాక్ డౌన్ లో ఉంది. లక్షణాలు ఉన్నా, లేకపోయినా పాజిటివ్ వచ్చిందంటే.. . కనీసం  వారం పాటు ప్రభుత్వ క్వారంటైన్ లో ఉండాల్సిందే. ఇందుకు సిటీ వ్యాప్తంగా వందకు పైగా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్ లో 50 వేల బెడ్లు ఏర్పాటు చేశారు. కానీ.. సరైన వసతులు లేవని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

క్వారంటైన్ సెంటర్లలో పై కప్పు సరిగ్గా లేక వర్షం పడితే నీళ్లు లోపలికి వస్తున్నాయి. ఇక 24 గంటలు లైట్లు ఆన్ లోనే ఉండటంతో నిద్రపట్టట్లేదని బాధితులు వాపోతున్నారు. కనీసం స్నానానికి వేన్నీళ్లు కూడా దొరకట్లేదని అంటున్నారు. కొన్ని చోట్ల ఫుడ్ లేదని.. మరికొన్ని చోట్ల ట్రీట్మెంట్ లేట్ చేస్తున్నారని అంటున్నారు. క్వారంటైన్ చాలా కష్టంగా ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం

కేంద్రంపై తప్పుడు ప్రచారం కోసమే ధాన్యం రగడ

మత ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లకు అనుమతి తప్పనిసరి