మత ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లకు అనుమతి తప్పనిసరి

మత ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లకు అనుమతి తప్పనిసరి

ముంబై: మహారాష్ట్రలో మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వాడకంపై సూచనలు జారీ చేసింది హోంశాఖ. ప్రభుత్వ అనుమతితోనే మే 3 వరకు లౌడ్ స్పీకర్లు వాడాలని తెలిపింది. మసీదులపై ఉంచిన లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ డీజీపీతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లు, అధికారులకు లౌడ్ స్పీకర్ల వాడకాలపై కొత్త ఆదేశాలు జారీ చేయాలని వివరించారు. భజనలు, ప్రార్థనల కోసం ముందస్తుగా అనుమతి తీసుకోవాలని నాసిక్ సీపీ దీపక్ పాండే చెప్పారు. అజాన్ కు ముందు, తర్వాత 15 నిమిషాల లోపు భజనలకు అనుమతి లేదన్నారు. మసీదుకు వంద మీటర్లలోపు భజనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలను కాపాడటమే ముఖ్యమని నాసిక్ సీపీ పేర్కొన్నారు. ఆర్డర్ ను ఉల్లంఘిస్తే.. చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

చట్టం కంటే మతం పెద్దది కాదు
వివాదాస్పదంగా మారిన లౌడ్ స్పీకర్ల అంశంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే స్పందించారు. ఈ విషయంపై ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మసీదుల్లో పెట్టిన లౌడ్ స్పీకర్లను తొలగించాలన్నారు. చట్టం ముందు ఏ మతమూ పెద్దది కాదన్నారు. ప్రార్థనలు చేసుకోవడానికి తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే మసీదులపై ఉంచిన లౌడ్ స్పీకర్లను మాత్రం తీసేయాలన్నారు. 

ఇవి కూడా చదవండి

ఈవారంలోనే పోలీసు నోటిఫికేషన్

ఒక్కరోజులో 90 శాతం పెరిగిన కరోనా కేసులు

లఖింపూర్ ఖేరీ కేసులో అశిష్ మిశ్రా బెయిల్ రద్దు