ఈవారంలోనే పోలీసు నోటిఫికేషన్

ఈవారంలోనే పోలీసు నోటిఫికేషన్

సంగారెడ్డి జిల్లా: వారంలో పోలీస్ నోటిఫికేషన్ విడుదల కాబోతోందని.. నిరుద్యోగ అభ్యర్థులు రెడీగా ఉండాలని ఆర్ధిక మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కోరారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాలులో  ఎస్ ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. 
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. మేము అన్నీ భర్తీ చేసుకుంటూ వెళ్తున్నాము.. మరి కేంద్ర ప్రభుత్వం 15 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తుందో బండి సంజయ్ చెప్పాలన్నారు. ధరలు పెంచినందుకు, ఉద్యోగాలు  ఇవ్వనందుకు, ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా..? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాల భర్తీ గురించి ఎక్కడికక్కడ బీజీపీని నిలదీయాలని, ట్విట్టర్ వేదికగా మోడీ, బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ప్రశ్నించండి అని కోరారు. 
3ఏళ్ల వయో పరిమితి రిలాక్సేషన్
చాలా మంది అభ్యర్థుల కోరిక మేరకు సీఎం కేసీఆర్ మూడేళ్ల వేయోపరిమితి రిలాక్సేషన్ ఇచ్చారని మంత్రి హరీష్ రావు తెలిపారు.  అలాగే 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశారని, పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం దేశంలో ఎక్కడా లేదన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

లఖింపూర్ ఖేరీ కేసులో అశిష్ మిశ్రా బెయిల్ రద్దు

జాతర ముగిసినా కొనసాగుతున్న భక్తుల తాకిడి

అఆలు రానోళ్లు.. సంతకాలు పెడుతున్నరు

ప్రైవేట్​ స్కూళ్లలో అడ్డగోలు దోపిడీ..బీటెక్ కంటే ఎల్కేజీ ఫీజే ఎక్కువ