జాతర ముగిసినా కొనసాగుతున్న భక్తుల తాకిడి

జాతర ముగిసినా కొనసాగుతున్న భక్తుల తాకిడి

అమ్రాబాద్: నల్లమలలోని దట్టమైన అడవిలో వెలసిన లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ నెల 15న ప్రారంభమైన జాతర... నిన్నటితో ముగిసింది. నిన్న ఆదివారం సెలవు కావటంతో... పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా సలేశ్వరం జాతరకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు యాత్రకు తరలివచ్చారు. అయితే ఈ ఏడాది ఆంక్షల మధ్య సలేశ్వరం జాతరకు అనుమతిచ్చారు. ప్రతి ఏడాది ఐదురోజుల పాటు జాతర జరుగుతోంది. కానీ ఈ సంవత్సరం మూడు రోజులు మాత్రమే జాతరకు అనుమతినిచ్చారు. 
సలేశ్వరం లింగమయ్యను దర్శించుకునేందుకు తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. గుట్టలు, పుట్టలు దాటూకుంటూ లింగమయ్యను దర్శించుకోవాల్సి ఉంటుంది. జనావాసానికి 25 కి.మీ దూరంలో దట్టమైన అడవిలో లింగమయ్య ఆలయం ఉంటుంది. అయితే జాతర చివరి రోజు... ప్రమాదం జరిగింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆలయ సమీపంలోని కొండ చరియలు విరిగిపడి ఆరుగురు భక్తులకు గాయాలు అయ్యాయి. వీరిని స్థానికులతో కలిసి పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

 

ఇవి కూడా చదవండి

59వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

అఆలు రానోళ్లు.. సంతకాలు పెడుతున్నరు

ప్రైవేట్​ స్కూళ్లలో అడ్డగోలు దోపిడీ..బీటెక్ కంటే ఎల్కేజీ ఫీజే ఎక్కువ