తెలంగాణలో కాంగ్రెస్ వస్తే కరెంట్​ ఉండదు : మంత్రి కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ వస్తే కరెంట్​ ఉండదు : మంత్రి కేటీఆర్

నర్సాపూర్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంట్​ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీబిడ్డ గొంతుకోసి టికెట్అమ్ముకున్న కాంగ్రెస్ ను బొంద పెట్టాలన్నారు. రైతుల గురించి పట్టించుకోని రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డిలో ఓడిపోతాడన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అసైన్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారు.

సౌభాగ్య లక్ష్మి ద్వారా ప్రతి ఆడపడుచుకు నగదు, గ్యాస్ సిలిండర్ రూ. 400 రూపాయలకే  అందిస్తామన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను కొనసాగించడానికి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, రాష్ట్ర నాయకులు శ్రీధర్ గుప్తా, రమేశ్ నాయక్, జడ్పీటీసీ భాభ్య నాయక్ పాల్గొన్నారు.