అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది

బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి టీఆర్ఎస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటిఆర్, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత రాంజ్యాంగాన్ని నిర్మించిన మహా గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భాగంగా ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. బోధించు, సమీకరించు, పోరాడు అనే  అంబేద్కర్ ఆశయాల్లో భాగంగా తెలంగాణను సాధించుకున్నాం. అందుకే హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో అగ్రిమెంట్ జరిగింది. త్వరలోనే ఆ నిర్మాణం చేపడతాం. కేసీఆర్ సర్కారులో దాదాపు 1000 గురుకులాలను  ఏర్పాటు చేసి అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నాం. మున్ముందు కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.