దేశంలోనే అగ్ర భాగాన  తెలంగాణ : మంత్రి కేటీఆర్ 

దేశంలోనే అగ్ర భాగాన  తెలంగాణ : మంత్రి కేటీఆర్ 

భారతదేశంలో అన్ని రంగాలకు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..దేశంలోనే  తెలంగాణ రాష్ట్రం అగ్ర భాగాన ఉందన్నారు మంత్రి కేటీఆర్. జూన్ 2వ తేదీన ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో పాల్గొన్నారు. జిల్లాలో 614 మంది గిరిజన రైతులకు 2,858 ఎకరాల పొడు భూమి పట్టాలను అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారాయన. ఒక్కప్పుడు సిరిసిల్ల అభివృద్ధికి ఆమడ దూరం ఉండేదని..ఇప్పుడు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్రనికి అభివృద్ధికి చిరునామాగా మిగిలిందని తెలిపారు.

పట్టణ ప్రగతి ఇన్నోవేషన్ అవార్డ్ లో జాతీయ స్థాయిలో సిరిసిల్లకు అవార్డులు, రివార్డులు  వచ్చాయని వెల్లడించారు. దేశంలో నేత కార్మికులకు నేతన్న భీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో ఆర్థిక క్రమశిక్షణతో GSDP క్రమేణా పెరిగిందని చెప్పారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి యావత్ దేశంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అభిప్రాయపడ్డారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని నీతి అయోగ్ వివేదికలో పేర్కొందని కేటీఆర్ గుర్తు చేశారు. దేశ జీడీపీలో తెలంగాణ భాగస్వామ్యం 5 శాతం కావడం మనకు గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రాల ఆదాయ పెంపు విషయంలో తెలంగాణ మిగితా రాష్ట్రాల కంటే ముందు ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.