బరాబర్ మాది కుటుంబ పాలనే..అడ్డమైన పార్టీకి ఓటేసి మోసపోవద్దు: కేటీఆర్

బరాబర్ మాది కుటుంబ పాలనే..అడ్డమైన పార్టీకి ఓటేసి మోసపోవద్దు: కేటీఆర్

బరాబర్ తమది కుటుంబపాలనేనన్నారు మంత్రి కేటీఆర్ . తెలంగాణలో ప్రతి ఒక్కడు కేసీఆర్ కుటుంబమేనని అందుకే తమది కుటుంబ పాలన అని చెప్పారు. 155 ఏళ్ల గ్యారంటీ లేని పార్టీ ఇచ్చే వ్యారంటీలను ఎవరూ నమ్మబోరన్నారు. అడ్డమైన పార్టీకి ఓటేసి మోసపోవద్దని సూచించారు. జిల్లాను కేంద్రం చేసిన ఘనత కేసీఆర్ దేనన్నారు.  ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు.

Also Read :- తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడి

కరెంట్ తీగలను పట్టుకుంటే 24 గంటల కరెంట్ వస్తుందో లేదో తెలుస్తుందని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్.  రూ.200 నుండి రూ.2016 పింఛన్ ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. మళ్ళీ పెద్దపల్లి అభివృద్ధికి కడుపు నిండా రూ. 50 కోట్ల నిధులు కేటాయిస్తానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన  దాసరి మనోహర్ ను గెలిపించాలన్నారు.