
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ నాగర్ కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కొల్లాపూర్‌లో చౌరస్తాలో సెంట్రల్ లైటింగ్ సిస్టంతో పాటు ఆర్ అండ్ బీ రోడ్లు, బ్రిడ్జిల పైలాన్ లు ఆవిష్కరించనున్నారు. నాగర్ కర్నూలులో నిర్మించనున్న డిస్ట్రిక్ లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మినీ ట్యాంక్ బండ్, నాగర్ కర్నూల్ రైతు బజార్ సీసీ రోడ్ల పైలాన్ ఆవిష్కరిస్తారు.
మిషన్ భగీరథ పైలాన్, ఆడిటోరియం, వెజ్- నాన్, వెజ్ మార్కెట్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కొత్తగా నిర్మించిన మున్సిపల్ బిల్డింగ్ తోపాటు బిజినేపల్లిలో ఎంపీడీఓ భవనం ప్రారంభిస్తారు. శాయిన్ పల్లి రూ.76 కోట్లతో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం బిజినేపల్లి మండల కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.