
రాష్ట్ర ఐటీ, పరిశ్రల శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పర్యటనలో మంత్రి షెడ్యూల్ ప్రకారం.. ముందుగా ఉదయం 11 గంటలకు ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లె గ్రామ పంచాయితీ భవనాన్ని ప్రారంభిస్తారు. ఆతరువాత 11.30 నిమిషాలకు ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఛీకోడు గ్రామంలో సీసీ కెమెరాలు, డిజిటల్ క్లాస్ రూమ్ లను ప్రారంభిస్తారు. అక్కడి నుండి 12.30 నిమిషాలకు గూడెం గ్రామంలో పీఎస్ఎస్ కమర్షియల్ కాంప్లెక్స్ భావాన్ని ప్రారంభిస్తారు. తర్వాత ఒంటిగంటకు సేవాలాల్ తండా జగదంబా దేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం, పోతగల్ గ్రామంలో రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కు తీరుగు ప్రయాణమౌతారు.