తొడగొట్టి సవాల్ చేసిన మంత్రి మల్లారెడ్డి

తొడగొట్టి సవాల్ చేసిన మంత్రి మల్లారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం మూడు చింతలపల్లిలో 62 కోట్లతో అన్ని రకాల అభివృద్ధి చేసిందన్నారు మంత్రి మల్లారెడ్డి. మూడు చింతలపల్లి లో ఉన్న అభివృద్ధి కొడంగల్ లో ఉందా అపిప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో మాట్లాడిన మల్లారెడ్డి...రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు లేవని పార్లమెంట్‌లో కేంద్రమే ప్రకటించిందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు విద్యా సంస్థలున్నాయన్నారు. తనకు 600 ఎకరాల భూమి ఉందని.. అందులో అసైన్డ్‌, చెరువులకు సంబంధించినది, కబ్జా భూమి లేదని స్పష్టం చేశారు. అంతా న్యాయబద్ధంగా కొనుగోలు చేసి, అభివృద్ధి చేసిన భూమి అని వివరించారు. అలాగే విద్యాసంస్థల్లోని భవనాలన్నింటికీ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు.

రేవంత్ రెడ్డి దొంగ, బట్టేవాజ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లారెడ్డి.. తాను ఎలాంటి బ్రోకర్ దందా చేయలేదన్నారు. లక్షలమందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. బ్రోకరిజం చేసి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడని ఆరోపించారు.తెలంగాణ లో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉంటే నా పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం.. రేవంత్‌ సవాల్‌ అంగీకరిస్తే రేపే రాజీనామా చేస్తానన్నారు మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి ఎంపీగా మళ్లా గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ రేవంత్ రెడ్డికి.. మల్లారెడ్డి సవాల్ విసిరారు.