మాకు అండగా కేసీఆర్ ఉన్నడు: మల్లారెడ్డి

మాకు అండగా కేసీఆర్ ఉన్నడు: మల్లారెడ్డి

సికింద్రాబాద్​, వెలుగు: రాజకీయ కుట్రలతోనే ఐటీ దాడులను బీజేపీ చేయిస్తున్నదని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తనపై, తన కుటుంబ సభ్యులు, బం ధువులపై జరుపుతున్న ఐటీ దాడులకు భయపడేది లేదన్నారు. ఐటీ సోదాలు ముగిశాక బోయిన్ పల్లి లోని టీఆర్ఎస్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ఐటీ, ఈడీ దాడులకు భయపడొద్దని కేసీఆర్ ముందే చెప్పారు. మాకు కేసీఆర్ అండ ఉన్నంత వరకు.. ఇలాంటి దాడులతో మాకేమీ కాదు. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు” అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నదని అన్నారు. ‘‘నేనెందుకు పార్టీ మారుతా, మాకు అండగా కేసీఆర్ ఉన్నడు. ‘మల్లారెడ్డి... దేనికీ భయపడొద్దు’ అని మాకు చెప్పిండు’. ఐటీ రెయిడ్స్ చేసినంత మాత్రాన పార్టీ మారుతమా? నేను మారను. వచ్చేది మా ప్రభుత్వమే. ఎన్ని అరాచకాలు చేస్తరో చేసుకోండ్రి. ఎవ్వరినీ వదలం. ఏదీ వదలం” అని హెచ్చరించారు. ‘‘నా కొడుకు ఆసుపత్రిలో ఉన్నా అధికారులు కనికరించలే. రిపోర్టు తయారు చేశామని, సంతకాలు పెట్టేందుకు రమ్మ ని చెప్పారు. ఒక ఫైల్‌‌‌‌‌‌‌‌పై నా సంతకం, మరోఫైల్‌‌‌‌‌‌‌‌ పై నా చిన్న కొడుకు సంతకం తీసుకున్నారు. విద్యా సంస్థలకు సంబంధించిన ఫైల్‌‌‌‌‌‌‌‌పై నా పెద్ద కొడు కుతో బలవంతంగా సైన్​ పెట్టించుకున్నారు. ఆ ఫైల్లో ఏముందో చూపాలని ఓ ఐటీ అధికారిని అడిగా. ఫైల్స్ అన్నీ బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లికి పంపినట్లు చెప్పడంతో అతన్ని కారులో తీసుకుని బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లి ఇంటికొస్తే అప్పటికే అధికారులు వెళ్లిపోయారు. తర్వాత బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లి పీఎస్​ వెళ్లి ఫిర్యాదు చేశా” అని తెలిపారు. తన ఇంట్లో దొరికింది కేవలం రూ.28 లక్షలేనని, కానీ రూ.100 కోట్ల బ్లాక్‌‌‌‌‌‌‌‌మనీ ఉన్నట్లు రాసి సంతకాలు పెట్టించుకున్నారని, అధికారులే ఇలా మోసం చేస్తారని అనుకోలేదని మల్లారెడ్డి చెప్పారు.

టర్కీ నుంచి వచ్చిన రాజశేఖర్‌‌‌‌రెడ్డి

సికింద్రాబాద్/శంషాబాద్, వెలుగు: ఐటీ అధికారుల ముందు హాజరయ్యేందుకు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి టర్కీ నుంచి గురువారం హైదరాబాద్‌‌కు చేరు కున్నారు. అక్కడ మీడియాతో రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. ‘‘ఐటీ సోదాల గురించి తెలిసింది. అధికారులకు సహకరిస్తా. మా దగ్గర ఎలాంటి అక్రమ ఆస్తులు లేవు” అని చెప్పారు. ఐటీ రెయిడ్స్ జరగడం ఇది మొదటిసారి కాదన్నారు. తాము 30ఏండ్ల నుంచి వ్యాపారం చేస్తున్నామని. 1995 లో ఒకసారి, 2008లో ఒకసారి ఇప్పుడు మూడోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. తన మామ మల్లారెడ్డితో కలిసి బోయిన్‌‌ల్లిలోనూ మీడియాతో రాజశేఖర్‌‌‌‌ రెడ్డి మాట్లాడారు. తమ ఇంట్లో 4 కోట్ల నగదు సీ జ్ చేసినట్లు తెలిసిందని, కాలేజీల్లో వేతనాలకు నెలకు కనీసం రూ.కోటికిపైగా చెల్లిస్తున్నామని, ఇంట్లో జీతాలకు పెట్టిన డబ్బులుంటాయన్నారు. అధికారులు కుటుంబ సభ్యులను వేధించారని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటాననన్నారు.