కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి మోడీకి వణుకు పుట్టిస్తుండు

కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి మోడీకి వణుకు పుట్టిస్తుండు

యాదాద్రి భువనగిరి జిల్లా :- సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ప్రధాని నరేంద్ర మోడీకి వణుకు పుట్టిస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో  చౌటుప్పల్ మండలం ఆరేగుడెం గ్రామంలో ప్రచారం నిర్వహించిన మంత్రి ఈ కామెంట్స్ చేశారు.  గత 18 సంవత్సరాలుగా  ఇక్కడ  ప్రజాప్రతినిధిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ  ప్రాంతానికి ఏలాంటి అభివృద్ధి చేయలేదని మల్లారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఇంటింటికి నీరు  ఇయ్యకపోతే ఓటు అడగనని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. మునుగోడు ప్రాంతానికి మిషన్ భగీరద ద్వారా ఇంటింటికి టీఆర్ఎస్ సర్కార్ నీరు అందించిందని తెలిపారు. దళితులను ధనవంతులుగా  చేయడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథాకన్ని తీసుకువచ్చారని మల్లారెడ్డి అన్నారు. 

మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి  బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న కూసుకుంట్ల.. ఈనెల 10న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌కు మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి హాజరుకానున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి ‍స్రవంతి పోటీ చేస్తున్నారు. నవంబర్ 3న ఈ  ఉపఎన్నికకు పోలింగ్ జరగనుండగా, 6వ తేదిన ఫలితాలు వెలువడనున్నాయి.