రేవంత్ రెడ్డి పైసలిచ్చి పీసీసీ పదవి కొనుక్కుండు

రేవంత్ రెడ్డి పైసలిచ్చి పీసీసీ పదవి కొనుక్కుండు

రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడని మంత్రి మల్లారెడ్ది అన్నారు. పైసలు ఇచ్చి పీసీసీ పదవిని కొనుక్కన్నాడని ఆరోపించారు. పీసీసీ చీఫ్ అవ్వగానే సీఎం అయ్యినట్లు కలలుగంటున్నాడని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ చేస్తున్న అభిృద్ధిని చూసి ఓర్వలేక అనవసర ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమి లేదని విమర్శించారు.  టీఆర్ఎస్ ది స్కీంల ప్రభుత్వమైతే..కాంగ్రెస్, బీజేపీలవి స్కాంల ప్రభుత్వాలని అన్నారు.

ప్రజాసంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ కే దక్కుతుందని మల్లారెడ్డి అన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మీ వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు టీఆర్ఎస్ ను మాత్రమే నమ్ముతున్నారని..రానున్న ఎన్నికల్లో కూడా తమ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.