- ఎస్సీ సంక్షేమ శాఖ బడ్జెట్ ప్రపోజల్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లకు సొంత బిల్డింగులు నిర్మించాలని ఎస్సీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ర్టంలో సొంత స్థలాలున్న 60 ప్రాంతాల్లో బిల్డింగులను నిర్మించాలని అధికారుల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు. ఒక్కోదాని నిర్మాణానికి 3 కోట్లు ఖర్చు అవుతుందని, 60 హాస్టల్స్ కు 180 కోట్లు ఇవ్వాలని ఫైనాన్స్ కు ప్రపోజల్స్ పంపారు.
రాష్ర్టంలో ఎస్సీ వెల్ఫేర్ పరిధిలో 634 హాస్టల్స్ ఉండగా.. ఇందులో 50 వేల మంది ఉంటున్నారు. ఈ సంఖ్యను 63 వేలకు పెంచాలని అధికారులు నిర్ణయించారు. వీటితో పాటు 2 ప్రాంతాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్స్ ను నిర్మించాలని ప్రపోజల్స్ పంపించారు. స్టడీ సర్కిల్ లో పేద ఎస్సీ స్టూడెంట్స్ ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.
