రాష్ట్రంలో అడవుల అభివృద్ధికి 1,270 కోట్లు : అటవీ శాఖ

రాష్ట్రంలో అడవుల అభివృద్ధికి 1,270 కోట్లు : అటవీ శాఖ
  •     అటవీశాఖ అభివృద్ధికి జైకా రుణ సహాయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అడవుల రూపురేఖలు మార్చేందుకు అటవీ శాఖ పకడ్బందీ ప్రణాళికలు రూపొందించింది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) సహకారంతో  రానున్న ఐదేండ్లలో రూ.1,270 కోట్లతో అటవీ శాఖను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేసింది. ఈ మేరకు  సోమవారం హైదరాబాద్‌‌లోని అరణ్యభవన్‌‌లో  ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్( పీసీసీఎఫ్​)  సి. సువర్ణ అధ్యక్షతన జైకా ప్రతినిధులతో సమావేశం జరిగింది. 

రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ సంరక్షణే లక్ష్యంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.1,270 కోట్లు కాగా.. ఇందులో 85% నిధులను జైకా నుంచి రుణంగా తీసుకోనున్నారు. మిగిలిన 15% నిధులను రాష్ట్రం భరించనుంది. ఈ నిధులతో రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి, టైగర్ రిజర్వ్‌‌ల బలోపేతం, వన్యప్రాణుల రక్షణ, అర్బన్ ఫారెస్ట్ డెవలప్‌‌మెంట్, అగ్నిప్రమాదాల నివారణ వంటి పనులను చేపట్టనున్నారు.