బోయిన్ పల్లిలో అమ్మవారిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి 

బోయిన్ పల్లిలో అమ్మవారిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి 

దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణ లో అన్ని అభివృద్ధి పనులు చేసిన సీఎం కేసీఆర్  జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.విద్యా, వైద్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. హరితహారం పేరుతో మెక్కలు పెద్దఎత్తున నాటడంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్నారు. రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి ..వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 

ఆనాడు పాండవులు వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని   ఆయుధాలు తీసుకొని కౌరవుల తో యుద్దానికి వెళ్లినట్లే సీఎం కేసీఆర్ కూడా దసరా రోజున భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నారన్నారు.  సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో టీంకు గౌడ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు.