ఆస్పత్రి నుంచి మంత్రి మల్లారెడ్డి బంధువు ప్రవీణ్ రెడ్డి డిశ్చార్జ్ 

ఆస్పత్రి నుంచి మంత్రి మల్లారెడ్డి బంధువు ప్రవీణ్ రెడ్డి డిశ్చార్జ్ 

హైదరాబాద్ : మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులు సోదాల అంశంలో కొత్త కొత్త ట్విస్టులు బయటికొస్తున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి మల్లారెడ్డి బంధువు ప్రవీణ్ రెడ్డి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రిలో ప్రవీణ్ రెడ్డితో పాటు మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ట్రీట్ మెంట్ అవసరం లేదని నిర్ధారణకు వచ్చిన ఐటీశాఖ అధికారులు... ప్రవీణ్ రెడ్డిని డిశ్చార్జ్ చేశారని తెలుస్తోంది. 

మరోవైపు..  ఇప్పటివరకు మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఆరోగ్యంపై మల్లారెడ్డి ఆస్పత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేయలేదు. 12 గంటలు గడిచినా అధికారికంగా హెల్త్ బులిటిన్ విడుదల చేయలేదు. ఇటు ప్రవీణ్ రెడ్డి సమాచారం కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం ఆస్పత్రి వద్ద సెక్యూరిటీ సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రి బయట మాత్రం సీఆర్ పీఎఫ్ బలగాలు ఉన్నాయి. ఇంకోవైపు మల్లారెడ్డి ఆస్పత్రిలోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 

మల్లారెడ్డి ఇంట్లో పని మనిషికి ఫిట్స్

ఇంతకుముందు.. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో పని మనిషికి ఫిట్స్ రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మల్లారెడ్డి నివాసం వద్ద టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరోవైపు ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు బందోబస్తులో ఉన్నారు.