యాసంగిలో వరి వేయం..వద్దని రైతులకూ చెప్పాం

యాసంగిలో వరి వేయం..వద్దని రైతులకూ చెప్పాం

పారిశ్రామిక రంగంలో పరిస్థితి వేరు..వ్యవసాయ రంగంలో మాత్రం కష్టం రైతుదే అని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు టీఆర్ఎస్ నాయకులు. ఇందులో భాగంగా మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి..ఒక్క తెలంగాణలో మాత్రమే అన్ని రకాల వాతావరాణాలను తట్టుకుని పంటలు పండుతాయని తెలిపారు. ఈ ఉత్పత్తులను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించాల్సి వస్తోందన్నారు. వనరులు ఉండి కూడా కేంద్రం సహకారం లేకపోవడంతో తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ కొద్ది పాటి ప్రోత్సాహం ఇస్తే చాలన్నారు.

రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉంచాల్నా? ఎత్తేయాల్నా?

గతంలో కేంద్రం, ఎఫ్‌సీఐ సహా పలు సంస్థలు  రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశంసించాయన్నారు. ప్రస్తుతం దురదృష్టవశాత్తు కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. రాజ్యాంగం పరిధిలో పని చేసే ప్రభుత్వం లా కాకుండా రాజకీయ పార్టీ వ్యవస్థలా పని చేస్తోందని ఆరోపించారు. మాకు పని లేకుండా ఢిల్లీకి వచ్చినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. యాసంగిలో వరి వేయం.. మీరే వరి వేయొద్దని చెప్పారు కాబట్టి రైతులను కూడా యాసంగిలో వరి వేయొద్దని చెప్పాం.. అది అయిపోయిందని, చరిత్ర అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వానా కాలంలో ఇచ్చే వడ్లు ఎంతిస్తే అంత కొంటామన్నారు. దానిని రాతపూర్వకంగా ఇవ్వండి అని అడగడానికే వచ్చామన్నారు. 60 లక్షల టన్నులు కొంటామని గతంలో చెప్పారు ఆ పరిమితి అయిపోవడంతో దాన్ని పెంచాలని కోరామన్నారు. రాష్ట్రంలో కొనుగోలు సెంటర్లు నడుస్తున్నాయని, వాటిని ఉంచాలా? ఎత్తేయాలో క్లారిటీ ఇవ్వాలని కోరామని ఆయన చెప్పారు. దీనిపై ఒకటి రెండ్రోజుల్లో చెబుతామన్నారు.. అందుకే ఢిల్లీలో ఆగాం.. కానీ ఆ సమయం అయిపోయినా ఇంకా ఎటువంటి స్పందన కేంద్రం నుంచి రాలేదని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.

మరిన్ని వార్తల కోసం..

 

దేశంలో వేగంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు