
తెలంగాణ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు.
యువజన కాంగ్రెస్ నేతగా 2004- 2014 మధ్య నల్గొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి గెలుపొందారు. వైఎస్, రోశయ్య, కిరణ్ కేబినెట్ లలో మంత్రిగా పని చేశారు. 2011లో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018లో నల్గొండ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు. 2019లో నగ్గొండ ఎంపీగా గెలుపొందారు. 2023లో మరోసారి నల్గొండ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.