టీచర్ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో బెంగాల్‌ మంత్రి అరెస్ట్‌

టీచర్ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో బెంగాల్‌ మంత్రి అరెస్ట్‌

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థా ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసింది. సుమారు 26 గంటలకు పైగా మంత్రి పార్థాను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. చివరకు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. 

శుక్రవారం అంతా విద్యాశాఖ మంత్రి పరేష్‌ అధికారే, ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్య ఇళ్లల్లో ఈడీ అధికారుల దాడులు కొనసాగాయి. అదే సమయంలో పార్థాతో దగ్గరి సంబంధాలు ఉన్న అర్పిత ముఖర్జీ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టి.. సుమారు రూ. 20 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖలతో పాటు పార్థా ఛటర్జీ.. టీఎంసీ సెక్రెటరీ జనరల్‌గానూ వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖలో అవినీతితో పాటు తన శాఖల్లోనూ ఆయన అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

టీచర్​ రిక్రూట్​మెంట్​ స్కామ్​పై విచారణలో భాగంగా ఎన్​ఫోర్స్​మెంట్ ​డైరెక్టరేట్​(ఈడీ) అధికారులు శుక్రవారం ఇద్దరు బెంగాల్ ​మంత్రుల ఇంట్లో తనిఖీలు చేశారు. పార్థ చటర్జీ, పరేష్​ అధికారి ఇండ్లలో ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు ఈ సోదాలు నిర్వహించారు. అలాగే పార్థ చటర్జీ అనుచరురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లోనూ రెయిడ్లు చేశారు. ఈ సోదాల్లో అర్పిత ఇంట్లో రూ.20 కోట్ల నగదు దొరికింది. కుప్పలు కుప్పలుగా పట్టుబడిన ఆ నగదును బ్యాంకు అధికారుల సాయంతో లెక్కించి సీజ్ చేశారు. ఆమె ఇంట్లోంచి 20 మొబైల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  ఈ సోదాల సమయంలో వారి నివాసాల బయట సీఆర్పీఎఫ్​సిబ్బంది కాపలా కాశారు. ఉదయం 8.30 గంటలకు ఎనిమిది మంది అధికారులతో కూడిన ఓ బృందం చటర్జీ, అర్పిత నివాసానికి చేరుకుని సోదాలు నిర్వహించగా.. మరో బృందం కూబ్​బెహార్​ జిల్లాలోని మేఖ్​లీగంజ్​లో పరేశ్​అధికారి ఇంట్లో తనిఖీలు చేసింది. ఈ మూడు సోదాలన్నీ ఏకకాలంలో జరిగాయని ఈడీ అధికారి ఒకరు చెప్పారు. అలాగే వెస్ట్​బెంగాల్​బోర్డ్​ఆఫ్​ప్రైమరీ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్​మాణిక్​భట్టాచార్య నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. బెంగాల్​స్కూల్​సర్వీస్​కమిషన్​రికమెండేషన్లపై గవర్నమెంట్​స్పాన్సర్డ్ (ప్రభుత్వ ప్రాయోజిత), ఎయిడెడ్​స్కూళ్లలో టీచర్​పోస్టులతో పాటు గ్రూప్​సీ, గ్రూప్​డీ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నది. ఆ దర్యాప్తులో భాగంగా ఎంత మేరకు డబ్బులు మారాయన్న దానిపై ఈడీ ఎంక్వయిరీ చేస్తున్నది. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య మంత్రిగా ఉన్న పార్థ చటర్జీ.. ఈ స్కామ్ ​జరిగినపుడు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే ఆయనను ఈ ఏడాది ఏప్రిల్​26న, మే 18న ప్రశ్నించింది. అలాగే విద్యాశాఖ సహాయ మంత్రి పరేశ్ అధికారిని కూడా కూచ్​బెహార్​లో ఈడీ విచారించింది. పరేశ్​ఇంట్లో సోదాలు జరుగుతున్న సమయంలో ఆయన కోల్​కతాలో ఉన్నారు. 

బీజేపీపై టీఎంసీ ఎదురుదాడి

ఈడీ దాడులను బీజేపీ చేపట్టిన కుట్రపూరిత చర్యగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. అయితే దీనికి బీజేపీ గట్టి కౌంటరే ఇచ్చింది. అసలు సినిమా ముందు ముందు ఉందంటూ ప్రతిపక్ష నేత సువెందు అధికారి ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికే బీజేపీ సర్కారు కుట్రపన్నిందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈడీని తమ నేతపై ఉసిగొల్పిందని మండిపడ్డారు. అయితే, టీచర్ ​రిక్రూట్​మెంట్​లో టీఎంసీ అక్రమాలకు పాల్పడిందని, నచ్చినవాళ్లకు పోస్టులు ఇచ్చుకున్నారని బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ‘‘టీఎంసీ లీడర్లు, వాళ్ల అనుచరులు అర్హతలేని వ్యక్తులకు జాబ్​లు ఇచ్చారు. ఈ విషయాన్ని ఈడీ, సీబీఐ తేలుస్తున్నాయి. ఈ స్కాంలో మరిన్ని తలకాయలు బయటపడతాయి” అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ​ఘోష్ ​అన్నారు.