అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు :  అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్​తో కలిసి బుధవారం మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు కొత్తగా ఎన్నో పనులు చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో రానివారు ఆందోళన పడొద్దని, తర్వాత విడతలో తప్పనిసరిగా వస్తుందని తెలిపారు.  కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రసాదరావు, ఏసీబీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, సీఐ ముస్కా రాజు తదితరులు పాల్గొన్నారు.