
తాను బీజేపీతో టచ్ లో ఉన్నానడం కరెక్ట్ కాదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు తనను ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు వెనకాడబోమన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ 10కి పైగా ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు పొంగులేటి.కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని తమకు ఎంఐఎం మద్దతు తెలుపుతుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు ఒకటి రెండు ఎంపీ సీట్లు గెలిస్తే ఎక్కువేనన్నారు. బీఆర్ఎస్ నేతలపై కక్ష పూరితంగా కేసులు పెట్టడం లేదని.. అవన్ని గత ప్రభుత్వంలో వాళ్లు అధికార దుర్వినియోగంతో చేసిన తప్పులన్నారు.
జలాశయాల్లో నీరు లేకపోవడం, పంటలు ఎండిపోవడం వంటి ఫోటోలు.. వీడియోలు పెట్టి కొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు పొంగులేటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ లో.. రాబోయే వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని నీటి నిల్వలు ఉంచాల్సిన బాధ్యత గత ప్రభుత్వంపై ఉంది..కానీ వాళ్లు చేయాల్సిన పనులు చేయకుండా భాద్యత విస్మరించారని తెలిపారు. కాళేశ్వరం ఫలితం ఎవరికి దక్కిందో అందరికి తెలిసిందేన్నారు.
ALSO READ :- Holi Special : రసాయనాలతో రంగు పడుద్ది.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
కాంగ్రెస్ లోకి రమ్మని మేం ఎవరిని అడగటం లేదు. ఎవరికవారే స్వచ్చందంగా వస్తున్నారు..మేం గేట్లు ఎత్తలేదు ఎత్తితే వరద ఆగదు. మేం చెప్పిందే చేస్తున్నం. గత పాలకుల అవినీతి మీద పోరాడుతూనే డిస్టర్బ్ అయిన వ్యవస్థను దారిలో పెడుతున్నం. ఐదు ఎకరాలకు రైతు బంధు అని చెప్పినట్టే ఇస్తున్నాం. జీతాల చెల్లింపుల్లో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమే. ఆ దిశగా పరిష్కారం కోసం పనిచేస్తున్నాం అని పొంగులేటి చెప్పారు.