అద్దె బకాయిలు కలెక్ట్ చేయండి : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

అద్దె బకాయిలు కలెక్ట్ చేయండి : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  •     హౌసింగ్ ఆఫీసర్లకు మంత్రి పొంగులేటి ఆదేశం

హైదరాబాద్, వెలుగు : హౌసింగ్ బోర్డుకు రెంట్, లీజు అమౌంట్​కట్టని వారి నుంచి బకాయిలు వసూలు చేయాలని అధికారులను హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియెట్ లో హౌసింగ్​పై మంత్రి రివ్యూ చేపట్టారు. హౌసింగ్ బోర్డు నుంచి లీజుకు తీసుకొని అమౌంట్​కట్టని

బిల్డింగులను రెంటుకు తీసుకొని అద్దె కట్టని వారికి నోటీసులు పంపా లని అధికారులకు స్పష్టం చేశారు. భూములు, బిల్డింగ్​లు, లీజు వివరాలను అధికారులు మంత్రికి అందచేశారు. ఈ మీటింగ్​లో ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి తదితరులు  పాల్గొన్నారు.