ధరణిలో సీక్రెట్ లాకర్లు ఓపెన్ ..సర్పంచ్ ఎన్నికల తర్వాత భూధార్ కార్డులు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ధరణిలో సీక్రెట్ లాకర్లు ఓపెన్ ..సర్పంచ్ ఎన్నికల తర్వాత భూధార్ కార్డులు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

స్థానిక ఎన్నికల తర్వాత భూ సరిహద్దులను ఫిక్స్ చేసి భూధార్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూభారతిలో నియమ నిబంధనలు కఠిన తరం చేశామని తెలిపారు. సెక్రటేరియట్ లో మాట్లాడినపొంగులేటి..  ప్రతి చిన్న విషయానికి కోర్టకు వెళ్లకుండా భూభారతిని తయారు చేశామని చెప్పారు. భూ భారతి వచ్చాక  9 లక్షల ఫిర్యాదులు వచ్చాయని..ఇందులో న్యాయపరమైనవి పరిష్కరించామన్నారు.. ధరణిలో వచ్చిన 2లక్షల 40 వేల అప్లికేషన్ల పరిష్కారానికి కృషి చేశామని తెలిపారు. దరఖాస్తులు రిజెక్ట్ చేసిన వాటికి సమాధానం ఇస్తున్నారని తెలిపారు.  

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిలో ఉన్న అనేక సీక్రెట్ లాకర్లు ఓపెన్ చేశామన్నారు పొంగులేటి. భూభారతిలో చెప్పిన విధంగా భూధార్ కార్డులు సిద్ధంగా ఉన్నాయన్నారు పొంగులేటి.  భూభారతి చట్టంతో రైతులందరికీ మేలు జరుగుతుందన్నారు పొంగులేటి. ధరణిని బీఆర్ఎస్ సర్కార్ విదేశీ సంస్థకు అప్పగించిందని చెప్పారు. కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక భూ భారతిని కేంద్ర సంస్థకు అప్పగించామన్నారు.  భయంకరమైన ధరణి వెబ్ సైట్ ను బంగాళాఖాతంలో పడేశామన్నారు. స్థానిక ఎన్నికల తర్వాత నక్షల్లేని గ్రామాల్లో సర్వేలు చేసి భూధార్ కార్డులిస్తామని తెలిపారు. ధరణి వెబ్ సైట్ తో బీఆర్ఎస్  రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చిందన్నారు.