హైదరాబాద్ లో లక్షా 80 వేల విగ్రహాలు నిమజ్జనం: మంత్రి పొన్నం

హైదరాబాద్ లో  లక్షా 80 వేల విగ్రహాలు నిమజ్జనం: మంత్రి పొన్నం

హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లను  మేయర్ గద్వాల విజయ లక్ష్మీ,ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తో కలిసి పరిశీలించారు.  ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ కి సంబంధించి అన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు లక్షా 80 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని చెప్పారు. హుస్సేన్ సాగర్ లో  నిమజ్జనం తర్వాత ఏర్పడిన వ్యర్థాల తొలగింపు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.  నిమజ్జనం కోసం ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.  అన్ని శాఖల సమన్వయంతో శాంతి భద్రతలు ఇతర సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 

సెప్టెంబర్ 6న  నిమజ్జనానికి సంబంధించి గణేష్ ఉత్సవ సమితి ప్రభుత్వం సమన్వయంతో ఇప్పటికే అనేక సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లు చేశామని చెప్పారు పొన్నం.  జీహెచ్ఎంసి హెచ్ఎండిఏ పరిధిలోనే కాకుండా , పంచాయతీరాజ్ శాఖ తరపున ప్రతి గ్రామంలో నిమజ్జ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు.  రేపు(సెప్టెంబర్ 6న) చివరి రోజు పెద్దపెద్ద వినాయకులు ఉత్సవంగా జాతరగా నిమజ్జనం జరుగుతాయి కాబట్టి.. ట్రాఫిక్ , శాంతిభద్రతలు ఇతర సమస్యలు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.  హైదరాబాద్ నుంచి  కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నలుగుమూలల నుంచి నిమజ్జనం తిలకించడానికి వస్తున్నారని తెలిపారు.  

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్. సాధ్యమైనంత త్వరగా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నాం.  భద్రతకు సంబంధించి పోలీసు భద్రత, షి టీమ్స్ ఇతర బృందాలు ఏర్పాటు చేశారని చెప్పారు.  భక్తులంతా ఆనందోత్సాహాల మధ్య గణేష్ ఉత్సవాలు నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పారు.